ఆత్మాభిమానం
ఆత్మాభిమానం


బాధ కనపడదు ఎందుకో
పెదాలపై కదలాడే
నవ్వుల వెనక
నిర్జీవమై పోయిందేమో
మనసు పలకదు ఎందుకో
అనుభూతుల్ని
అనుసరిస్తూ
మూగబోయింది ఏమో
ఆత్మాభిమానం
శిరశెత్తి నిలబడింది ఎందుకో
శోభిత కిరీటాలను
ధరించిన అందుకేమో
కథ కంచికి పోయే బతుకైనా
విధి వంచనకు గురైన
విరించి రచనకు ఎదురెగైనా
నిప్పులా నిలబడే తత్వానికి
తానే మకుటంలా!!!