ఇదీ పరిస్థితి
ఇదీ పరిస్థితి


స్వీయ నిర్బంధం లో మనసు మౌనాన్ని భాషగా రాస్తోంది
ఆకలిని దీక్షగా తీసుకున్నమేను
బద్దకాన్ని బదులిస్తోంది
కలం కాలాన్ని బదులడిగి
ఓ రెండక్షరాల్ని పోగేద్దామంటే
పిల్లల పోరు, శ్రీవారి హోరు
వంటగది లోకానికి
ఉప్పు కారాల సమతూకానికి
వండివార్చే పాకాల మధ్య
మిధ్యగా మిగిలిన ఆలోచన
విరక్తిగా నవ్వుతోంది
ఇదీ పరిస్థితి