ప్రియురాలి లేఖ
ప్రియురాలి లేఖ


ఓచెలీ! అందుకున్నా నీ ఉత్తరం ఇన్నాళ్ళకి,
అందింది నీ తప్పిపోయిన ఉత్తరం, ఇన్నేళ్ళకి.
ఆనందోత్సాహంలో అక్షరాలు కన్పించలేదు కళ్ళకి,
ఉద్వేగంలో మరిచా, కళ్ళజోడు పెట్టడం, కళ్ళకి.
ఈ వయసులో తొలిప్రేమ జ్ఞాపకాల గిలిగింతలు,
నలభై వయసులో, ఇరవై మనసు చేసే కవ్వింతలు,
నాటి ఓర తూపులు, కోర చూపులు, గిల్లి కజ్జాలు,
మనససు పొరలను చీల్ఛుకొచ్చిన తుళ్ళింతలు.
దొంగచాటు కలయికలో, దాగిన బెదురుతనం
నీ చూపులే మిక్చర్ పొట్లంగా భావించిన వైనం
పెద్దలమాట పట్టించుకోని నాటి ఆకతాయితనం
వదిలించారు పెద్దలు, పెళ్ళితో మన తెంపరితనం.
పెళ్ళితో ఒకటిగా చేసారు పెద్దలు, మనిద్దరినీ,
చలికాలానికి వెచ్చని గొంగళి నీకౌగిలిని చేసుకొనీ,
ఇప్పుడుచేరిన నీఉత్తరాన్ని, మురిపెంగా అందుకొనీ,
ఇచ్చా నీచేతికి, నీవే ప్రేమారగా చదివి వినిపిస్తావనీ.