కోపం
కోపం


పూర్వ జన్మ పాపంరా
మనుషులకొక శాపం రా
కోపం ఒక లోపంరా
శాంతం మణి దీపంరా !!
చిర్రుబుర్రులు
కస్సుబుస్సులు
విసుర్లు కసుర్లు
నసుగుళ్ళు సణుగుళ్లు
చిటపటలు మొటమొ మొ టలు
పంతాలు పట్టింపులు
చిరాకులు పరాకులు
కోపానికి మారాకులు !!
ఆవేశానికి ఇవ్వకు అవకాశం
ఆనందాన్ని అంతనియ్యి ఆకాశం
కోపం ఉండనివ్వకు లవలేశం
సమస్యలకు పరిష్కారం సావకాశం !!
కోపమనే దీపంలో ఆహుతవ్వకు అనుక్షణం
బుద్ధి కలిగి శాంతం తో జతను కట్టు ప్రతి క్షణం
పాదం కింద క్రోధముంటే ఆనందమే అనుక్షణం !!