Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SRINIVAS GUDIMELLA

Classics

3  

SRINIVAS GUDIMELLA

Classics

మనిషి బుద్ధి

మనిషి బుద్ధి

1 min
13


పాడు బుద్ధి జాడ రా 

మంచి బుద్ధి యాడ రా 

మునుగుతున్న ఓ డరా 

మనిషి బుద్ధి చూడరా ! 


అవతలి వాడిని తొక్కాలా 

అందాలెన్నో ఎ క్కాలా 

అందినదంతా మెక్కాలా 

అన్ని దైవాలకు మొక్కాలా ! 


అడ్డదారి నడవాలి 

చెడ్డదారి గెలవాలి 

చచ్చి చెడి బ్రతకాలి 

నానా గడ్డి కతకాలి ! 


బలహీనత పట్టరా 

బలం మీద కొట్టరా 

ధనం కొల్లగొట్టరా 

ఇహం పరమ నీదిరా ! 


బల్ల గుద్ది చెబుతారా 

కుళ్ళు బుద్ధి నీదేరా 

పాడు బుద్ధి పోదేరా 

మంచి బుద్ధి రాదేరా ! 


నేను నా స్వార్ధం  

ఇదే జీవిత పరమార్ధం 

తెలుసా జీవితానికి అర్ధం 

తెలియకుంటే నీకే అనర్ధం ! 


ఇంటి గుట్టు రట్టురా 

యూట్యూబ్ లో పెట్టరా 

హిట్లు, లైకులు కొట్టరా 

కాసులు చేతబట్టరా ! 


ఎవరినెలా వాడుకుందాం 

ఎవరితో ఎలా ఆడుకుందాం 

ఎవరినెలా మోసగిద్దాం 

ఎంత పైకం దండుకుందాం ! 


మనది ఒకడికి పంచం 

మనకి డబ్బే ప్రపంచం 

దేవుడికిస్తాము లంచం 

చేడు జరిగితే సహించం ! 


గోతి కాడ నక్కలు 

విశ్వాసం లేని కుక్కలు 

తీస్తే పాపాల లెక్కలు 

కనిపిస్తాయి వీరికి చుక్కలు ! 


అవకాశవాదులురా 

గుచ్చే గుండు సూదులురా 

పాపాలకు పాదులురా  

కట్టాలి వీరికి సమాధులురా ! 


మనకి మనమే గొప్పరా 

పది మందిలో డప్పురా 

నీ సోదే చెప్పరా  

నిజాలను కప్పరా ! 


ఈసీ మనీ కావాలి 

లేజి గా బ్రతకాలి 

క్రేజీ లైఫ్ ఉండాలి 

నేనే బాగుండాలి !


Rate this content
Log in

Similar telugu poem from Classics