రాగ్గింగ్
రాగ్గింగ్
యవ్వనాలా హంగులా
టీనేజీ పొంగులా
కాలేజీ గ్యాo గులా
రాగ్గింగుల కింగులా !!
ఆదిలోనే హంసపాదా
అర్ధంలేని అలవాటు పోదా
ఏడిపించడం సీనియర్ల వంతా
ఏడవడం జూనియర్ల తంతా !!
చదువుకొచ్చేవారికి చావు తేవొద్దు
ముందు తరాలకి మందు పాతరలు పెట్టొద్దు
వికృత చేతల వింత జాతరలు చెయ్యొద్దు
భావితరం భవిత పాడు చెయ్యొద్దు !!
తరిమి కొట్టు ఈ భూతాన్ని
అదిమి పెట్టు ఈ అనర్ధాన్ని
తెలుసుకో నీ ఉనికి అర్ధాన్ని
అర్ధం చేసుకో జీవిత పరమార్ధాన్ని !!