డబ్బు
డబ్బు


డబ్బంటే డబ్బేరా మందులులేని జబ్బేరా ముట్టుకుంటే గబ్బేరా బ్రతుకు మట్టి దిబ్బరా !! అప్పు పెద్ద తప్పురా పొంచి ఉన్న ముప్పురా నివురు గప్పిన నిప్పురా ఇది అబద్దమని చెప్పరా !! నెత్తికెక్కాయిరా కళ్ళు కొవ్వు పెంచిందిరా వొళ్లు మనసు నింపుకుందిరా కుళ్ళు మంచి మనిషిగా పైకి వెళ్ళు !! ఎందుకురా ఈ ఆత్రం ఏమిటిరా నీ గోత్రం దోచుకోవడమే నీసూత్రం ధనానికి చేస్తావు స్తోత్రం !! నాలుగు రాళ్లు కాదురా నలుగురు మనుషులు చాలురా పరుల మంచి కోరారా పుణ్యమంతా నీదిరా !!