ఈ తరం
ఈ తరం


వణుకుతోంది నరం నరంచె ప్పన గు నా ఇది నా తరంచెడిపోతోంది ఈ తరం వందే మాతరం వందే మాతరం !! ఎదిరిస్తారు బెదిరిస్తరు బాధిస్తారు సాధిస్తారు !! ప్రతి నిమిషం విందులు ఆడ మగ చిం దులు గంజాయి మత్తులో పండులు పడొద్దురా ఇబ్బందులు !! చేతిలో ఐఫోన్ లు చెవిలో ఇయర్‌ఫోన్ లు తలకి హెడ్ఫోన్ లు భవితకి డేంజర్ జోన్ లు !! ప్రతి క్షణం Entertainment అనుక్షణం Enjoyment మానవత్వానికి Embarrassmentఇవ్వాలిరా వీళ్లకి Treatment!! ఎటు పోతున్నావు ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు ఏమవుతున్నావు !! సిగ్గు, శరం పోయిందా బుద్ధి జ్ఞానం వస్తుందా హద్దు పద్దు ఉంటుందా ఈ తరం మంచి కంటుందా !! వెకిలి చేష్టలు వెర్రి వాగుడు పగలే తాగుడు, రాత్రి ఊగుడు పట్టదురా అయినవారి దేవుడు ఎందుకురా నీకు తిండి, బట్ట, గూడు !! ఎప్పుడొస్తారో కొంపకి ఎప్పుడొస్తారో బయటకికోప తాపాలు చీటికి మా టికి కోరికల కోలాటాలు పూట పూటకి !! అడిగితే తప్పరా చెబితే ముప్పురా బుర్రకి పట్టే తుప్పురా నిజమేపుడు నిప్పురా !! డేటింగ్లు, చాటింగులు బాయ్‌ఫ్రెండ్లూ, గర్ల్‌ఫ్రెండ్లూ ఎటు పోయిందిరా నీ culture ఏమవుతోందిరా నీ Future!! పెద్దలు పట్టించుకోరు చిన్నలు వినిపించుకోరు ఇంత బయటా ఒకటే పోరు జరగనిది జరిగితే భోరు భోరు !! పెడ దారిన పోకండి చెడు దారిన నడవకండి మంచి మాటలు వినండి మంచి పనులు చెయ్యండి !!