ఎవరు నేను
ఎవరు నేను


ఎవరురా నేనెవరురా
అసలింతకీ నేనెవరురా
అమ్మ తొమ్మిది నెలల కష్టం
నాన్న నెత్తురు వారసత్వం
వేరు చేస్తే వింతచోద్యం...రామా హైడ్రామా.
నువ్వె చక్కని జాతిరత్నం అంటుఉంటారంతానిత్యం.
నీకు నువ్వే తెలుసుకోవా సత్యం అసత్యం.
వ్యదలే బలమైతే ..విజయం కాదా?
కలలే నిజమైతే... కథ అవ్వదా.
బ్రతికేందుకు వెతుకొక దారి
ఆశించకు పూల ఎడారి
నీ గమనమే మోక్షపు దారి
బ్రతికెయ్యర బాటసారి.
కథలే నువ్వై మిగిలే వరకూ పట్టించకు గతి గోదారి.
కదంతొక్కుతూ ప్రపంచమంతా సైన్యయంగా వెంటుండగా
కలం మార్చుతూ బ్రహ్మ రాసిన రాతను మార్చుట కష్టమా?
సలాం చేస్తావా? కలాం అవుతావా? నిర్ణయమెపుడూ నీకళ్లల్లో నిప్పై వెలగాలి.
ఆ నిప్పే జ్యోతై ప్రపంచమంతా వెలుగులనే పంచాలి.
ఎవరికెవరను ప్రశ్నలన్నిటి జవాబు నువ్వే కావాలి.