వైఖరి
వైఖరి


తరిమేతరిమేప్రతి నరమే మాదే యవతరమే.
కదిలే కదిలే ప్రతి క్షణమే మాదే యువతరమే.
రక్తం మరిగే పౌరుషమే మాదే యువతరమే.
మీసం లోనే మగతనమే మాదే యువతరమే.
అవసరమైతే దించేస్తాం ఆకాశాన్నే తోక పట్టుకుని లాగేస్తాం తోకచుక్కనే. నచ్చినవన్నీ చేసేటంత దమ్మే ఉంది లోకాన్నైనా శాసించేంత తెగువే ఉంది. లక్ష్యాన్నైనా చేదించేస్తాం తక్షణమే శతృవునైనా ప్రేమించేసే లక్షణమే.
ప్రేమే జీవితమనుకుంటాం ప్రేమలో పోటీ పడుతుంటాం.
ఎన్నో ఏవో అనుకుంటాం ఏదేదో చేసేస్తుంటాం.
స్నేహం దాహం తీర్చేస్తాం స్నేహానికి ప్రాణాలిస్తాం.
తప్పటడుగులే వేస్తుంటాం తప్పులు మేమే చేస్తుంటాం.
ఎన్నటికైనా ఆ నింగే మా గురి. ఎవ్వరికోసమో మార్చుకోము మా వైఖరి.