ఓ అమ్మాయీ
ఓ అమ్మాయీ
అతిశయమే సంశయమింపక చెప్పిందే ఓ అమ్మాయీ
దివి నుండి భువిపై రాలిన తారకనువ్వని అమ్మాయి.
సంబరమే అంబరమంటెను నినుచూడగనే అమ్మాయీ
అచ్చెరువై టక్కునకోరీ ఇచ్చామనసే నీకోయి.
ఎందరో నిను కోరొందురుగా దేవత నువ్వే అమ్మాయీ
నేనొచ్చితి నిన్నర్చింపగ , ననుతెచ్చితి నైవేథ్యంబుగ నీకోయి.
నువు మెచ్చగ అచ్చికబుచ్చికలాడుదమే ఓ అమ్మాయీ
నేన్నచ్చకపోతే ముచ్చట మరచుటసాధ్యములేవోయి.
నా ఊపిరి రూపం నువ్వే,అపురూపమూ..నువ్వే అమ్మాయీ...
నేనేమీ తక్కువకాదు,ప్రతిదినమూ నిను మెప్పించెదలేవోయి.
నా జీవిత అర్ధం నువ్వే, పరమార్ధమూమరి నీవై అమ్మాయీ....
నా వేకువ దర్శనమీవే,నా ఆలై మక్కువకావే....చాలోయి,చాలునాకోయీ.......

