STORYMIRROR

Mahesh krishna

Drama

4  

Mahesh krishna

Drama

అమ్మ

అమ్మ

1 min
264

అన్ని పదాలకెళ్ల గొప్ప పదం అమ్మ.

ఎన్నో బిరుదులకెళ్ల గొప్ప బిరుదు అమ్మ.

ఆకలేసి ఏడ్చినచో ,అన్నపూర్ణ అమ్మ

గర్భం లో గెంతినచో, భూదేవి మా అమ్మ.

బిడ్డ అలిగినపుడేమో బుజ్జగించునమ్మ

తప్పు చేసినపుడు ,ఆమే దుర్గమ్మ.

కరుణ కురిపించుటలో మహాలక్ష్మివమ్మ

భర్తని పూజించుటలో అమ్మ సీతమ్మ.

అక్షర సంద్రం లో సరస్వతై అమ్మ

ఒడిలొ కూర్చుండబెట్టి ఓడైనావమ్మ.

మరణం లేనే లేని ఆభరణం అమ్మ

యుగాలు మారినా మారని ప్రేమే నీదమ్మ.

నిశి లో ఉన్న మాకు జాబిలమ్మవై

వెలుగు చూపి మా భవితకు బాటవైనావు,బంగరు బాటవైనావు.

బిడ్డ ఆకలి కనిపెట్టడంలో తల్లిని మించిన దేవత లేదు రాదు.

ప్రేమతో నీ పుత్రుడు



Rate this content
Log in

Similar telugu poem from Drama