Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahesh krishna

Romance

4.7  

Mahesh krishna

Romance

నెరజాణ

నెరజాణ

1 min
1.1K


హే నెరజాణ,నిను చూసిన నిముషాన

వందల కొద్దీ కవితలు మెదిలే మదిలోన.

ఓయ్ నెరజాన ,నిను తలచిన నిముషాన

లెక్కలేనన్ని నవ్వులు నిండెే అధరాన.

నీదే ఊరైనా,దూరం ఎంతైనా

ఉరికిఉరికి వచ్చేసెయ్నా మైనా ఏమైనా .


నీకలలకు వంతెన వేసేస్తా,కన్నీళ్లను కట్టడి చేసేస్తా

మల్లెలతో మాలలు కట్టేసి,నీ జడకే వాటిని కప్పేస్తా

పల్లకిలో ఊరేగిస్తా,నా రాణిగ నిను చూపిస్తా

కనుబొమ్మలొ నిను దాచేసి,ఆ కునుకుని వద్దని విసిరేస్తా.

ఏలోకాన్నైనా ఏ రాజ్యానైనా

కలగననేలేని,సామ్రాజ్యాన్నే సృష్టిస్తానే మైనా ఏమైనా


కష్టం లో కౌగిలినౌతా,విజయం లో వేడుకనౌతా

నామదిలో కోవెల కట్టి,దేవత లా నిను పూజిస్తా

కన్నోల్లని గుర్తుకుతెస్తా,నాలో ప్రతిబింబించేస్తా

చంటిపాపలా చూస్తా,నీ కంటిపాప నేనౌతా

జంటై నీతో కలిసి,నా ఇంట వెలుగులే నింపేస్తా.

ఏ జన్మనైనా,ఏ జంటకైనా

ప్రేమంటే మనదేనంటూ వినిపించేలా చెప్పేస్తానే మైనా నామైనా



Rate this content
Log in

Similar telugu poem from Romance