STORYMIRROR

Mahesh krishna

Inspirational

4  

Mahesh krishna

Inspirational

మార్పు

మార్పు

1 min
408

ఎన్నేళ్లైనా,ఎన్నాళ్లైనా జనమందరి చూపు మిన్ను వైపు.

ఆకలి దప్పిక తీర్చే ఆఖరి చినుకుల కొఱకు.

కాలయముడి కాలంలో రామరాజ్యంకై ఎదురుచూపు.

ఆ కలి చేతుల్లో కీలుబొమ్మేనా పేదవాని బ్రతుకు?

నిస్సందేహంగా సందేహాలను అడిగే స్వేఛ్చవైపు ప్రజలచూపు.

సందేహాలు సరే సమస్యలు పరిష్కరించే నాయకుడు ఎవరికెరుకు.


ప్రగతికైనా,పురోగతికైనా, 

వృధ్దికైనా,అభివృధ్దికైనా కావాలి ముందుచూపు.

విజేతను ఎన్నుకోవడానికి తుది తీర్పు ప్రజాతీర్పు.

కాగితాలకు మాత్రమే పరిమితం కాకూడదు హామీలు

ఒక్కనోటుతో శాస్వతంగా తీరవు పేదోని బాకీలు.

నిలకడలేని నాయకులకు పాడాలి చరమగీతం.

నియంత్రణ కలిగిన పాలనకే జనాభయ హస్తం.


కాలుదువ్వి కదలిరా నవసమాజాన్ని నిర్మిద్దాం.

తల ఎత్తుకు తిరిగేలా మన ఖ్యాతిని రచిద్దాం.

ఆనవాలు అనేలా పాఠాన్నే లిఖిద్దాం.

ఆటుపోట్లు ఎదురైనా న్యాయాన్నే గెలిపిద్దాం.


        ఇట్లుః మహేష్ కృష్ణ



Rate this content
Log in

Similar telugu poem from Inspirational