నేను తెలుగువాడిని
నేను తెలుగువాడిని


తెలుగు భాషను అవహేళన చేసే వాళ్ళు ఈ తెలుగు జాతిలో ఉన్నంత కాలం
ఎక్కడ మన తెలుగు అంతరించి పోతుందో అని భయపడాల్సివస్తుంది.
పుట్టుక మొదలైనప్పటి నుంచి తెలుగులోనే బ్రతుకును సాగించి,ఇప్పటి వరకు ఎన్నో జ్ఞాపకాలను సంపాదించిన వాళ్లే
మన తెలుగును చులకన చేసి మాట్లాడుతుంటే గుండె బాధతో కొట్టుకుంటుంది.
బ్రతుకు తెరువు కోసం పరాయి బాష అవసరమేమో కానీ,బ్రతుకే పరాయి బాషకు అంకితమవుతుంటే,ఈ పర బాష ప్రేమను చూస్తున్న కళ్ళు కుమిలిపోతున్నవి.
తెలుగు వాడిగా తెలుగు జాతిని,తెలుగు భాషని ఎలుగెత్తి చెప్పి నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకోవాలి కానీ ,
అవసరం కోసమో,స్వప్రయోజనాల కోసమో పర భాషని గౌరవంగా ,మన బాషని హీనంగా చూస్తుంటే
మన తెలుగుకి గ్రహణంలా ఒక తెలుగు వాడే మారితే, అసభ్య పదజాలంతో ఆ పరభాషా ప్రేమికులని గొంతుఎత్తి అరవాలనిపిస్తుంది....