నిరుద్యోగ యువతా !
నిరుద్యోగ యువతా !
ఏ తల్లిదండ్రుల ఆశాజ్వాలవో !
ఏ గురువుల కరదీపికవో !
ఆశయసాధనలో ఒక బాటసారివి ;
సూర్యుని తొలికిరణానికి నేస్తానివి .
నిత్యం అలుపెరుగని పోరు నీది ;
రహస్య గమ్యానికి అన్వేషణ నీది .
చదువు క్రమశిక్షణతో సాగినా ,
విద్యాలయంలో విజయం సాధించినా ,
నేటికీ నిరుద్యోగివి . దేశ భవిష్యత్తువి !
సరైన ప్రయత్నముతోనే ఫలితము ;
ఆ సంగతి గుర్తించుము .
చదివినవే చదువు . మరల మరల చదువు .
శోధనలోనే కలదు ఆనందము ;
ఆకాశమే హద్దుగా పొందుము .
పత్రికా పారాయణము అనుదినము ;
వార్తలు విశేషాలతో పరిచయము ,
ఉద్యోగ ప్రకటనలతో సహచర్యము .
వ్రృత్తి అనుబంధ విద్య నేటి అవసరము .
నేర్చుకో ! ప్రతిభను నిరూపించుకో !
నీ అభిరుచికి తగిన పని ఎంచుకో !!
*** *** ***