ముందుకు వెళ్తే ..!
ముందుకు వెళ్తే ..!


నీ మెడలో మూడుముళ్ళు వేయాలనుంది .
నాతో కలసి నీవు ఏడడుగులేస్తే
ఉబ్బితబ్బిబ్బవ్వాలనే కుతూహలమూ ఉంది .
వెనక్కు మళ్ళితే ...
ఆ ఒంటరితనం గుర్తొచ్చి , నా గుండె మండుతుంది .
ఓదార్చవచ్చిన నిన్నుచూసి
మంచుకొండల్లో ఇపుడు తానున్నానంటుంది .
మనమిలా ముందుకు వెళ్తే ... ... ... ...
ఇలలో అంతకన్నా భాగ్యం ఏముంటుంది ?
నన్ను నమ్ము , ప్రియా ! కలలోనూ
నీతోనే ఆనందం నా చెంతనుంటుంది .
మళ్ళీమళ్ళీ నిన్నే పెళ్ళాడినా ,
ఏడుజన్మల బంధం ఆనాడే మొదలైందనిపిస్తుంది .
ఎంత నడిచినా , నీతో తరగనిదూరం
ప్రయాణించాలనుందేమో
అనీ నా మనసు అందుకు సిద్ధమౌతుంది .❣️