STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

ప్రేమసౌధం

ప్రేమసౌధం

1 min
1.2K

గమనంలో కొత్తదనం ప్రతిదినం .

కొండగుహలే ఆవాసమైన నాడూ మనిషిలో

   సహజమైన ప్రేమ .

వెన్నెలను చూసి తన జీవితానికి తానాయె

   ఓ చందమామ !

ప్రేయసితో , పంచుకున్న మాధుర్యం .

కోయిలలా గానగాంధర్వం .

ప్రేరణ ఊహలను నిజం చేసింది .

సౌభాగ్యం మురిపిస్తూ కళ్ళెదుట నిలిచింది .

పొలంలో పంటలను పండిస్తే

   చెరొకపని చేయగా వారే ఒకరికొకరు .

కలసి సంతోషంగా భుజించారు .

చేయిచేయి కలిపి

   తమలోకి ఆధునికతను ఆహ్వానించారు .

ఆదరాభిమానాలు బంధువులను

   సహాయసహకారాలు స్నేహితులను

   పరిచయం చేయగా

   పరివారం విస్తరించిన కొమ్మలు రెమ్మలుగా .

ఫలితం పూలు , పండ్లలా .

ఆలుమగల అలా నిర్మిత

  పొదరిల్లు కాదా ముచ్చటగొలిపే ప్రేమసౌధం !

ఆనందాన్నిచ్చే భూతల స్వర్గం !!



Rate this content
Log in

Similar telugu poem from Thriller