దప్పిక తీరినదాహం తీరలేదు
దప్పిక తీరినదాహం తీరలేదు
నీ మనసు చెప్పిందే చేసేయి
నాకేం కావాలో దానికి తెలిసినంత
నీకూ తెలియదు.....
నా మది మీటిన రాగం వల్ల
నీ మదిలో జీవన రాగం పలికింది....
అందుకే నీవంటే నాకిష్టం
నా ఇష్టఇష్టాలకె నీవు అత్యంత ఇష్టం......
అందుకే నన్ను ఎలుకోమ్మని నీ మీద అశపడ్డాను
నా మనసు చెప్పిందే చేస్తున్నాను
నీకేం కావాలో దానికి తెలిసినంత
నాకూ తెలియదు.....
నీ మది మీటిన రాగం వల్ల
నా మదిలో నవ్వుల స్వరం మ్రోగింది
అందుకే నీవంటే.......
నా బంగారు సొగసులను స్పృశించే వాడివి
నా ముత్యాల పరువాల కొండలను అధిరోహించేవాడివి
నా రత్నాల నడుము లోయలను తడిమేవాడివి
నా పగడాల ద్వీపాన్ని దర్శించే వాడివి
నా వజ్రపు ప్రాయాన్ని మకుటంగా ధరించే వాడివి
నీ కౌగిలిలో కరిగిన తరువాత వచ్చే సుఖం
పురివిప్పిన నా సోయగాలకే తెలుసు
నీ తీయ్యని ప్రేమ రుచులు
విచ్చుకున్న నా పెదవులకె తెలుసు
నా తనువులో రగిలే అగ్నిజ్వాలను
ఆర్పగల శక్తి నీ స్పర్శకే ఉంది
అలసిన నీ హృదయాన్నీ అడుగు
నేను ఇచ్చిన ఆనందాన్ని మర్చిపోగలదేమోనని
నాకు దప్పిక తీరింది కానీ దాహం తీరలేదు
నా కోరిక తీర్చావు కానీ ఆశను అందుకోలేదు
నా ఉహాల్ని నిజం చేసావు కానీ నా ఊపిరి నీవే
అదే నిజం, ఆ నిజమే నీవని తెలుసుకో....

