STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Romance Inspirational

3  

ARJUNAIAH NARRA

Abstract Romance Inspirational

మంచు బిందువులుఅర్జున్ నర్ర

మంచు బిందువులుఅర్జున్ నర్ర

2 mins
172

***

కవిత్వం

కేవలం అక్షరాల మాల కాదు

మనసు లోతుల్లో నుండి

ప్రయాణించే భావాల సంద్రం


******

 నమ్మకం

ఒక్కసారి తెగితే

మళ్ళీ కలపలేని

ఒక సాలీడు కట్టిన తీగ లాంటిది


******

 మాట

ప్రాణం తీసే ఒక ఆయుధం

ప్రాణం పొసే ఒక సంజీవని

అందుకే

గుండెను చిల్చే ఒక తూటా 

గుండె గాయానికి మందు కూడా


*****

బతుకు

పుట్టుకకి, చావుకు

 మధ్యలో ప్రయాణం


*****

నవ్వు

గుండెకి నొప్పిని తెప్పించగలదు

నొప్పిని దాచగలదు


****

 కాలం

వెనుకడుగు వేయలేని

వింత ప్రయాణికుడు


****

 కన్నీరు

కళ్ళతో చదివే మనసు మాట


****

 సత్యం

ఒక జననం ఉన్నట్లయితే

ఒక మరణం ఉన్నట్లే


*****

 నిద్ర

వచ్చిన వాడికి సుఖం

రానివాడికి దుఃఖం


*****

 గాలి

కనిపించని మన ప్రాణం

ఉంటే ఉన్నట్లు

పోతే పోయినట్లు

ఉన్నప్పుడు గుర్తించం

పోయినప్పుడు మనం ఉండం

*****

 చెట్టు

త్యాగానికి ఆదర్శం

పంచటానికి ఉండదు హద్దు

తనకు ఏమి వద్దు

సర్వం ఇవ్వటమే తనకు ముద్దు


******

 కలలు

కళ్ళకు కనిపించని

జీవిత

గమ్యాలను మార్చగలవు


*****

 ఎదురు చూపులు

కరుగుతున్న కాలంలో

కదలకుండా తపించే

మనసు మౌనం


****

 ధైర్యం

భయాన్ని భయపెట్టే భరోసా

గుండె వేగాన్ని తగ్గించే మాత్ర


*****

 మౌనం

అర్థం చేసుకునే మనసుకు

అందమైన భాష


******

 అభిమానం

మనసును మెప్పించగలదు

గుండెను కాల్చగలదు


****

 స్నేహం

కాలం చేసిన ‘అనుబంధ’చట్టం

మరణంతో మాయమయ్యే చుట్టం 

అందుకే మిత్రుడు

చీకటిలో చంద్రుడు

పగటిలో సూర్యుడు


*****

 కోపం

కాయాన్ని కాల్చుకునే

అగ్ని కాగడా

తను కాలుతూ

ఇతరులను కాల్చగలదు


*****

 సంతోషం

 వేసవి కాలంలో

వచ్చే చిరు జల్లులు

వెలిసాక

గాలి ఆడక

కష్టాల ఉడుకపోత తప్పదు


*****

 దుఃఖం

 శరీరంలో ఉండే సాధారణ ఉష్ణోగ్రత

 ఎపుడు ఉండేది

కానీ ఎక్కువైతే

 అవయవాలు ఉడికిపోవాల్సిందే


*****

 అపార్థం

 వినికిడి లోపం వల్ల

 నిజాన్ని

 తప్పుగా అర్థం చేసుకోవటం


****

 బాధ

నీవు ఎలా ఉన్నా

 వినిపిస్తుంది

 కనిపిస్తుంది


****

 డబ్బు

ఒక మాయ పరమపద సోపానం

ఒదిగి ఉండే వారు ఎదుగుతారు

ఎగిరిపడే వారు పడిపోతారు

ఎవరు ఎపుడు ఎదుగుతారో

 ఎక్కడికి పడిపోతారో తెలియదు


****

 దెయ్యం

దేవుడికి శత్రువు

భయానికి పర్యాయ పదం

దేవుడు- దెయ్యం

సైన్సుకి వ్యతిరేఖ పదాలు


****

 దేవుడు.....

వేల సంవత్సరాల నుండి

ప్రపంచమంతా ఏకమై

భూమి మీద , నీటిలోను,

గాలిలోను, శూన్యంలోను

దేవి… దేవి…లేనివాడిని 

దొరుకుతాడేమోనని

దేవగా…దేవగా …

ఏ దేవులాడుటలో దొరకని వాడే…. 


Rate this content
Log in

Similar telugu poem from Abstract