STORYMIRROR

ARJUNAIAH NARRA

Children Stories Tragedy Inspirational

4  

ARJUNAIAH NARRA

Children Stories Tragedy Inspirational

అమ్మను అనాథను చేశాం -అర్జున్

అమ్మను అనాథను చేశాం -అర్జున్

1 min
335


అన్ని తానైన తనను అనాథను చేశాం

అమ్మ అంటే....

అమ్మంటే దేవుడిచ్చిన వరం

దేవుడికే రూపం వచ్చిన రూపం

ప్రకృతికి ప్రతి స్వరూపం 

ప్రతి ప్రాణికి జన్మనిచ్చే ప్ర్రాణం


ఆమె గర్భమే ...మన మొదటి ఉనికి

అమ్మ స్తన్యం.. మన మొదటి విందు

అమ్మ చేతి వేళ్ళు.....మన మొదటి జ్వరమానిని

అమ్మ ఒడి....మన మొదటి బడి


అమ్మంటే........మన తొలి గురువు

అమ్మంటే........మన మొదటి వైద్యుడు

అమ్మంటే........మన తొలి స్నేహితుడు

అమ్మంటే........మన తొలి క్రీడా కారుడు

అమ్మంటే........మన తొలి వాహనం

అన్ని తానైన.... మనం తనని అనాథను చేశాం


పిడికెడు మెతుకులు పెట్టలేక

గుక్కెడు నీళ్లు తాపించలేక

బొక్కల పోగైయిన పెయ్యికి

చలికి వొణికి పోతున్న ఒంటికి 

కనీస బట్టలు వెయ్యలేక

మూలుగుతున్న ముసలి అవ్వకు

ఒక మాత్రయిన కొనివ్వలేక

తనను అనాథను చేశాం....

ఒక్క సారైనా అనాథ ఆశ్రమానికి వెళ్ళు

అక్కడ అమ్మను చూసి ఎన్నో నేర్చుకోవడం కోసం 


పసితనంలో నీవు గుక్కపట్టి ఏడుస్తుంటే 

జోలపాటలో ఎన్నెన్నో నేర్పింది

లాలిపాటతో నీ పెదవులపైన చిరునవ్వును

చెదరనివ్వకుండా చూసుకుంది

ఇపుడు తన వృద్ధాప్యంలో 

ఎన్నో జ్ఞాపకాలు అనుభవాలు 

నీకు నేర్పి తనువు చాలించాలనుకుంటుంది

వెళ్ళు.......వెళ్లు.....

వీక్షించి వీగిపోయిన కళ్ళకు 

నీ రూపంతో ఆనందాన్ని కలిగించడానికి 

చలనం కోల్పోయిన చేతులకు

నీ చేతులతో స్పర్శను తెప్పించటానికి

ఆమె చెవిటి తనాన్ని పోగొట్టే నీ పిలుపు 

'అమ్మ' అన్న శబ్దం వినలేక......

పురిటినొప్పుల ప్రేగును పెకిలించినట్లుగా

విల విల లాడుతున్నది అయితే

ఈ సారి మృత శిశువును కన్న

మాతృమూర్తి శోఖము వలే 

తన మనసు దుఃఖిస్తుంది 

వెళ్ళు.......వెళ్లు.....

ఏడ్చి ఏడ్చి కన్నీళ్ల జీవనది ఎడారిగా మారిన 

తన వాళ్ళ కోసం ఎదురు చూడటం 

నేర్చుకోవడం కోసం వెళ్లు

జవ సత్వాలు కోల్పోయినా 

నిసత్తువతో నిలబడడం నేర్చుకోవడం కోసం వెళ్లు

ఊపిరి వదల లేక మరణంతో పోరాటం చేస్తూ 

తనవారి కోసం ఎదురు చూడటం 

నేర్చుకోవడం కోసం వెళ్లు

కాదంటే ఒంటరి తనాన్నీ 

ఓదార్చు కోవటం నేర్చుకోవడానికైనా వెళ్ళు

ఒక్క సారైనా అనాథ ఆశ్రమానికి వెళ్ళు

అక్కడ అమ్మను చూసి ఎన్నెన్నో నేర్చుకోవచ్చు


ఎందుకంటే.....

ఇపుడు నీ పిల్లలు 

నిన్ను అనాథశ్రమానికి 

పంపించే సమయం ఆసన్నమైంది

జర జాగ్రత్త బిడ్డ....


నీకోసం.....

నీ భవిష్యత్తు కోసం...?

మీ అర్జున్


Rate this content
Log in