దేశమేధస్సు-అరణ్యవాసం BRAIN DRAIN -అర్జున్ నర్ర
దేశమేధస్సు-అరణ్యవాసం BRAIN DRAIN -అర్జున్ నర్ర
BRAIN DRAIN
దేశ మేధస్సు-అరణ్యవాసం
*******************
మేము భారతీయులం
ఈ దేశం మాదే అంటాము
ఈ దేశం వదిలి వెళ్లే జాబితాలో
ముందుగా మేమే ఉంటాం
వసుధైక కుటుంబం అంటాం
తమ్ముళ్లకు వాటా లేదంటం
స్వదేశీ వస్తువులే కోనాలంటాం
విదేశీ వస్తువులనే వాడేస్తుంటాం
మన సంస్కృతి
విదేశీయులకు
తలమానికం అంటాం
విదేశీ విష సంస్కృతిని తలకెక్కుచ్చుకుంటాం
పాశ్చాత్య దేశంలో ప్రేమను భోదిస్తాం
ప్రాచ్యదేశంలో ప్రేమికులను విడదీస్తాం
అందరు సమానమే అంటాం
కులాలుగా విభజన చేస్తాం
అందుకె ఈ దేశం విడిచిపోతున్నాం
పరదేశంలో ప్రవాస
భారతీయులుగా ఉంటున్నాం
భరతమాత
నేలన అడుగులు నేర్చినోడ
ఓడిలో అక్షరాభ్యాసం చేసినోడ
డాలర్ హొయలకు, వలపులకు
పరదేశపు తలుపులు తీసినోడ
ప్రియురాలి వ్యామోహం వదిలి
కదలి రావోయ్ కడకు
తల్లి కన్నీరు తుడచటానికి
తుదకు చూపవోయి
నీ దేశభక్తిని!
నీలి గగనంలో
దూరంగా తరలిపోతున్న
ఓ మేఘమా!
పరాయి దేశంలో ఎండిన మట్టిని
తడిపి
పంటలు పండిస్తావా?
ఎడారిగా అవుతున్న
భారత నేల దాహార్తిని తీర్చి
చూపవోయి నీ దేశభక్తిని!
ఓ దీపశిఖా!
నీ కిరణాలు
పరాయి దేశంలో
కాంతిని వేదజల్లుతుంటే
భరత ఖండంబులో
చీకటి ముసురుకోదా?
నీలో దేశభక్తిని రగిలించు
వెలుగువై తిరిగి రా!
నీ వాకిట దీపాలు వెలిగించు
వెలుగు నీదే !వెలుగు ఇక్కడే!
నీ గిరులను విడిచి
వాడను వదిలి
ఊరును మరిచి
తరలిపోయి
పరదేశీ నేలను
తడుపుతున్న
ఓ నదీ ప్రవాహమా!
నీ ఒడ్డు బీడుగా మారిపోదా?
దేశభక్తి అలవై
సిరులను పండించ
తరలి రా నీ తల్లి ఓడికి!
ఆకాశం వైపు చూపిస్తే
మేఘమై ఎగిరినవాడ
గాలిపటం చేతికిస్తే
గగనతలంలోకి దూసుకెళ్ళినోడ
ఈత కోసం చెరువును చూపిస్తే
అంతర్జాతీయ నదిలోకి ప్రవహించినోడ
నీ రాకకై విలపిస్తున్న
భారతమాతను ఓదార్చి
ఓసారి చూపవోయి నీ దేశభక్తిని!
ఓ గులాబీ పువ్వా!
నిన్ను పెంచిన మట్టి ఏదీ?
నిన్ను మోసిన తల్లి ఏదీ?
పరాయి దేశంలో
పరిమళాన్ని గుభాళిస్తే
భారత నేల దుర్గందంగా మారదా?
నీ తల్లి ఒడిలో పరిమళం నింప
నింపుకోవోయి నీలో దేశభక్తిని!
అవకాశం...
తలుపులు తెరిచినప్పుడు
కన్నతల్లి లాంటి ఈ దేశాన్ని వదిలి ఆకాశంలో...
నీ ప్రయాణం చూసినప్పుడు
నవమాసాలు మోసి
మృత శిశువును కని
శోకిస్తున్న మాతృ మూర్తి వలె
ఈ భారత మాత కనిపించింది
ఇపుడు దేశభక్తిని...
నిరూపించుకునే వంతు నీదే!
నేను ఈ దేశంలో, ఈ నేలను
నా వెన్నెముకను వంచి సాగు చేస్తే
నా నెత్తురు మరిగి ఇంధనమై
నా చేతులు విమాన రెక్కలై
నా కాళ్ళు రన్ వే పై విమాన చక్రాలై
నా మనసు పైలట్ గా మారితే
నీవు విమానం ఎక్కావు
గగన తలంలో ప్రయాణించావు
పరాయి దేశంలో
నీ స్వప్నాలను సాకారం చేసుకొన్నావు
ఇప్పుడు దేశభక్తిని...
నిరూపించుకునే వంతు నీదే!
