కరోనా - పేరడీ పాట - కవీశ్వర్
కరోనా - పేరడీ పాట - కవీశ్వర్


27. 06 . 2020. కరోనా - పేరడీ పాట
( ఓ బంగరు రంగుల చిలకాపలుకవే- బాణీలో)
పల్లవి: ఓ జూనియర్ ఇంటర్ రాణీ--- తెలుపవే....
ఓ సీనియర్ ఇంటర్ రాజా---ఏమని.....
నాకేమి కరోనా లేదనీ ... ఆపై ఏమీ కాదనీ.....
" ఓ జూనియర్ ఇంటర్రాణీ"
చరణం :1. శానిటైజర్ రాచేసీ -- కరములన్నీకడిగేసీ...
శుచిగా నీకై వస్తీనే - మాస్కును కట్టీ ఉంటి నే--
వెచ్చని నీరూ తాగేసీ -- గొంతును సాఫ్ చేసేసీ
నీకొఱకై వేచి యున్నా కలిమిలో .......
నీ రక్షణలో , నీ చేరువలో నిర్భీతిగా ఉంటే చాలులే .......
" ఓ జూనియర్ ఇంటర్ రాణీ "
ఓ సీనియర్ ఇంటర్ రాజాచెప్పవా----
ఓ జూనియర్ రాణీ ఏమనీ?-----
నీవేమి తిరుగా బోవనీ ---- ఇంట్లోనే వేచి ఉంటాననీ ---
" ఓ సీనియర్ ఇంటర్ రాజా "
చరణం : 2. వాట్సాప్ తెరిచేసీ ---- కలిసి సుద్ది చెప్పేసీ ఒక మీటర్ దూరం ఉండనీ ---
కరోనా దరికే రాదనీ ---- తొరగ నష్టం లేదనీ --- దాని మందు రావాలనీ .....
ఈ సమరం లో ఆ దూరం లో --- పయనించే టందుకే .....-------
" ఓ సీనియర్ ఇంటర్ రాజచెప్పవా?"
ఓ జూనియర్ ఇంటర్ రాణీ ----- తెలుపవే
ఓ సీనియర్ ఇంటర్ రాజా------ఏమనీ ?
$$$$$$ కవీశ్వర్
కే. జయంత్ కుమార్ రాజేంద్రనగర్
హైదరాబాద్ .