క్రోధి ఉగాది కవిత అంశం : ఇష్ట కవిత
క్రోధి ఉగాది కవిత అంశం : ఇష్ట కవిత


క్రోధి ఉగాది కవితల
తేదీ 12 /3/24 మంగళవారం
అంశం : ఇష్ట కవిత
*********
కలి యుగం లో ఈ చైత్రవసంత ప్రకృతి సౌందర్య ఆకృతి
తొలి పల్లవాల షడ్రుచుల వేపపూత పచ్చడి ఉగాది స్వీకృతి
ఉష సంధ్యవేళల కోయిలలు కిలకిలా రావాలజనుల స్వరజతి
ఆశల , లక్ష్యాల చేరికకు , మన ప్రణాళికల అమలుకు పదజతి
క్రోధము పైన క్రోధి నామ సంవత్సర ఆగమనం ఆధిపత్యం
సౌమ్యం , శాంతంగా మన ఈ కాలాన్ని గడిపితే సమంజసం
భవిష్యత్తు బాగుపడు నమ్మకము తో బాపడు శ్రవణం
చేసెను పంచాంగ , వార్షిక ఫలాల పఠన సమాచారం
నిశ్చయముగా వదిలివేయాలి వ్యసనాల , కలహాల జీవనం
దరిచేరకుండా చూసుకోవాలి ఈర్ష్య,అసూయ దుర్గుణాల హారం
దగా,మోసం,అత్యాశ,దురాశ తనవారిని,పరులనుచేయొద్దు బలిహారం
దరిచేరనీయాలి ఆహ్లాద, సంతోషాల ఆనంద పండుగల హేలా రజం
మొదటి రోజు చేసిన పూజలు వ్రతాలు మనము కలిగించు పుణ్యాలు
తనకున్న దానితో తృప్తి చెంది, జనం సంతోషం తో చేరాలి లక్ష్యాలు
గత సంవత్సరములో కలిగిన సంతోష , దుఃఖాలు అనుభవ భోగాలు
వర్తమానం లో జీవిస్తూ,భవిష్యత్తు కు వేసుకోవాలి సుకృతములైన బాటలు
పేరు . జయంత్ కుమార్ కవీశ్వర్