యోధుడు!
యోధుడు!


తెలిసి...తెలిసి..
పులికి ఆహారమయ్యే జింక ఏది?
పిల్లికి దొరికే..ఎలుక ఏది?
వలకు చిక్కే...చేప ఏది?
బోయావాని బాణానికి...
ఎదురెళ్లే... విహంగం ఏది?
తెలిసి...తెలిసి..
నిప్పుని తాకేదెవరు?
సుడిగుండం లో దూకేదెవరు?
ప్రాణాలు పోతాయంటే...
పరుగెత్తనిదెవరు?
ఉన్నారు...ఒకరున్నారు
అతడే...అతడే...
గుండె ధైర్యానికి... మారు పేరు!
పోరాటంలో అతనికి... పోటీయే లేరు!
అది ఎవరో కాదు...
మన సరిహద్దు సిపాయి
దేశాన్ని కంటి పాపలా...
కాపాడే...కనుదోయి!
ప్రతి దేశానికి ఉంటుంది సరిహద్దు
కానీ!...
ఈ అమర వీరుడి త్యాగానికి
లేనే లేదు...యే హద్దు
తన జాతి కోసం...
ప్రాణమివ్వటం అంటే...
అతనికెంతో...ముద్దు!
ఓ..దేశ నాయకులారా!
ఆ అమర వీరుల...
కుటుంబాలకు అండగా ఉండండి ముందు
ఓ...యోధుడా...
దేశం మొత్తం...
గర్వపడుతుంది...నీ యందు
.......రాజ్......