మగ మృగాళ్ళారా...
మగ మృగాళ్ళారా...
లేడి పిల్లను....
నాలుగు చిరుతలు..
వెంటాడి వేటాడి...
పీక కొరికి..రక్తం పీల్చి...
ఈడ్చుకు వెళ్తున్నట్టు...
మృగ మగాళ్లు...
ఆడ పిల్లలను అందరి ముందు...
అమాంతం ఎత్తుకు పోయి..
అంగాంగాలను..
అంగలేసుకుంటు...
చొంగ కార్చుకుంటూ..ఆరగించి...
ఆకలి తీరక...
అవయవాలను చిద్రం చేసి
అంతం చేసి...
వికృత ఆనందం పొందే...
వీర్య...మృగల్లారా...
ఏం సాధించామని విర్ర వీగుతున్నారు?
గర్భంలో ఉండగనే..
ఈ గబ్బు పనులకు అలవాటు పడ్డారా!
తల్లి కడుపున తన్ని తన్ని..
ఆడుకుంటూ...
కడుపును చీల్చుకు వచ్చిన మీకు..
ఆడపిల్లల అవయవాలు అంటే...
ఆట వస్తువులయ్యాయా!
ఓ...
మదమెక్కిన.. మతితప్పిన..
కామ కాలకేయుల్లారా...
దానవ రాజుకైన..
>మగువ పై..మనసు కలిగితే ..
మెప్పించి..నొప్పించక చేసే కదా..శృంగారం!
మనసు లేని మదనం లో...
ఏమి మత్తుండురా?
మర మనిషి తో మంచమెక్కినట్టుండు!
దానవులకులైన తెలిసె గదరా..
పంచుకోనిదే....పంచకెందుకని?
మరి...
ఈ మానవ దానవలకేల తెలిసి రాదే?
మదమెక్కిన చాలు..
మగువపై మృగమోలే....పడుచుండే!
ఓ..మగ మహారాజా..
కండ కరగాలంటే...
కాయ కష్టాన్ని మించిన..
కామ క్రీడ లేదురా!
ఇప్పటికైనా..తెలుసుకో..
నీవు మదించాల్సింది..మగువను కాదు
నీ... మనసు ని!
మనసుని గెలిచి....
మానవత్వాన్ని పొందిన..
మకుటం లేని మహారాజు లా.....రా!
నీ రాకకై...
ఎదురు చూస్తూ ఉంటా!
.....రాజ్.....