తారా జువ్వ
తారా జువ్వ
వచ్చిందయ్యా! వచ్చింది .. దీపావళి వచ్చింది!
చీకట్లు చీల్చి మన జీవితాలకు ..
వెలుగునిచ్చేందుకు వచ్చింది.
కలహాలతో దూరమైన కుటుంబాలను .. కలిపేందుకు..
కాకర పువ్వొత్తియై ... వచ్చింది...
అమావాస్యలో నున్న వారికి వెన్నెలనిచ్చేందుకు..
వెన్న ముద్దయై వచ్చింది..
శూన్యమనుకున్న .. జీవితాలకు .. వెలుగునిచ్చేందుకు..విష్ణుచక్రమై వచ్చింది
మూసి వున్న మూగమనసులను తట్టి లేపేందుకు..
కమ్మరేకు టపాకాయయై.. వచ్చింది..
మనుజుల మధ్య అడ్డుగా ఉన్న..
విష గుణాల నంతమొందించేందుకు..
పాము బిళ్ళలై వచ్చింది
నిద్రావస్థలోనున్న చైతన్యాన్ని
నిత్యం మేల్కొలిపేందుకు..
చిటపట టపాకాయలై .. వచ్
చింది..
అలముకున్న అంధకారం అంతమొందించేందుకు..
చిచ్చుబుడ్డియై .. వచ్చింది..
ఆడ బిడ్డల మాన ప్రాణాలను హరించే
మత్తు మారాజుల తాటతీసేందుకు
లక్ష్మీబాంబై.. వచ్చింది..
భారత జాతి ఖ్యాతి విశ్వమంతా వ్యాపింపజేసేందుకు
తారాజువ్వై..వచ్చింది.
భూ ప్రజల బాధలను తుడిచి పెట్టేందుకు
భూ చక్రమై వచ్చింది..
వచ్చిందయ్యా! వచ్చింది .. మన దీపావళి వచ్చింది.. మన జీవితాలే వెలిగించుకుంటే
అది ఆనందకేళి
మన చుట్టూ ఉన్న వారికి వెలుగునిస్తే..
అదే దీపావళి...
...రాజ్ తొర్లపాటి...