స్వేచ్ఛ కోసం
స్వేచ్ఛ కోసం
............................
రక్తాన్ని పంచిన అమ్మ చేసే సేవను..
సాటి లేని ప్రేమందువు
నీ రక్తాన్ని పంచుకున్న సోదర సాయాన్ని
గొప్ప బంధమందువు
నీతో కలిసి తిరిగిన స్నేహితుడు ఆదుకుంటే
మిత్రుడంటే నీవే రా అని అందువు కదా
అసలు నీవొకడంటు ఉంటావని తెలీక
నువ్వు తనకేం అవుతావో తెలియకపోయినా
నీ..నా స్వేచ్ఛ కోసం..
ప్రాణాలే బలిచ్చిన స్వాతంత్ర సమర యోధులును
ఏమందువు మరి!
నేడున్నది..
ఎంత అత్యాధునిక నాగరిక యుగమో కదా!
ఇంత స్వేచ్ఛని..ఇంత సంతోషాన్ని ఇచ్చిన
త్యాగదనులు..తెలియని నిర్లక్ష్య యుగం
తెలుసుకోని తీరిక లేని యుగం
తెలియజేయని కరెన్సీ యుగం
భ్రమణం చేస్తూ వచ్చి
భ్రమరం వలె మనల్ని దోచి
మనలో మనకి
<p>కాంతాలం(అసూయ) పెంచి కషణం(రాపిడి) పెంచి
అంతర్గత కల్లోలం కలిగించి
ఆక్రమణ చేసి ఆసాంతం
తన కటకం(పిడికిలి) లో పెట్టుకున్న
తెల్లవాడి పీచమణచేందుకు
ఎన్ని పీకలు తెగి పడ్డాయో
ఎంత రక్తం ఏరులై పారిందో
మరెంతమంది నిరాశ్రయులయ్యారో
తెలుసుకుంటివా సోదరా
తలచుకుంటివా సోదరీ
తెలియజేశావా.. ఓ నాగరిక సమాజమా?
నీ స్వేచ్ఛకోసం
తమ స్వేచ్ఛనే కాదు ప్రాణాలని సైతం
పణంగా పెట్టిన త్యాగ మూర్తుల కోసం
తెలుపని పుస్తకాలెందుకు
తెలుసుకోని చదువులెందుకు
తెలియజేయని గురువులెందుకు
తెలపాలన్న బాధ్యత లేని
ప్రభుత్వాలెందుకు? ఎందుకు?
.....రాజ్ తొర్లపాటి....