మైత్రి 🤝
మైత్రి 🤝
.....................
తనువులోని అణువణువును
చిరుగాలి తడిమినంత హాయైనది
తరువులోని అణువణువుపై
చిరుజల్లు జారుతున్ననంత అందంగా
ఉండే బంధం..స్నేహం👫
మైత్రి బంధం..పెరుగు..వలె
చిక్కనైనది
అలకలు ఆనందాలు ఆత్మీయతల
కవ్వంతో చిలికిన..
మజ్జిగ వలె మనసును చల్లబరుచునది
స్నేహితుడు సబ్బు వంటి వాడు
వాడుతున్నంత చాలును
తాను కరిగిపోతూ..మనలోని
మానిల్యాన్ని... కడిగేయును
ఏపుగా ఎదిగిన చెట్లన్నీ ధృఢమైనవి కానట్లు
లోతుకు పోయిన వేర్లన్నీ బలమైనవి కానట్లు
స్నేహి
తులందరూ...సహచరులు కాకపోవచ్చు
కొంత మంది స్నేహితులు ..
ఎడారి మొక్కలా
ఇసుక తుఫానులు వంటి
కలతలు కలహాలు..అవరోధాలు ఎదురైనా
మనసు అంతరాల లోకి పాతుకు పోతారు
ఎవరినైతే..
తలచినంతనే..చూసినంతనే
స్పృశించినంతనే.. మాట్లాడినంతనే
హృదయం..ఆహ్లాదం..ఆనందం.. ఆత్మీయత
ఆర్ద్రత తో ద్రవిస్తుందో..అతడే నిజమైన స్నేహితుడు
కుళ్ళు..ముల్లు కొట్టుకు పోయే
స్వచ్ఛమైన సెలయేటి ప్రవాహం..స్నేహం
....రాజ్ తొర్లపాటి...