శ్రమజీవులం
శ్రమజీవులం
శ్రమ జీవులం మేం
భగ భగ మండే ఎండలకు
టప టప కురిసే వానలకు
హోరు హోరున వీచే గాలులకు
నక నకలాడే ఆకలి కడుపులకు
దోస్తులం మేం..శ్రమ జీవులమ్ మేం
ఓ కార్మిక...నిరంతర శ్రామికా
కష్టానికి...కార్య రూపం నీవు
శ్రమ కి...శ్రీకారం నువ్వు
నాలుగు చక్రాల కారుకైన
అవి నడిచే తారు రోడ్డు కైన
నలభై చక్రాల ట్రైను కైన
అవి నడిచే పట్టాల కైన
నీ నరాలు.. నలగాల్సిందే
కండరాలు..కరగాల్సిందే
మార్కెట్ నడవాలన్న..
పరిశ్రమ పరుగెత్తాలన్న
భవంతులు నిలబడాలన్న
భగవంతుడికి రూపమివ్వాలన్న
నీ బాహువులు భారాన్ని మోయాల్సిందే
అంత్యంత దయనీయం ఏంటంటే..<
/p>
నువ్వు నిలబెట్టే.. భవంతులే
నిన్ను బలికోరడం
నువ్వు పరుగెత్తించే పరిశ్రమలే
నిన్ను పడగొట్టడం
నువ్వు నడిపించే వాహనాలే
నిన్ను నలిపేయడం
నువ్వు రూపమిచ్చిన భగవంతుడే..
నిన్ను కాల రాయటం
ఓ..కార్మిక..నిరంతర శ్రామిక
నువ్వు లేనిదే.. భువిపై...లేదు యే ఏలిక
నువ్వు పడుతున్న శ్రమలు చాలిక
నీ హక్కులకై.. పెట్టు పొలికేక
ఏ ప్రభుత్వమైనా.. సంస్తానమైన.. దిగి రావాలిక
కార్మిక శక్తికి తగిన ప్రతిఫలం దొరికిన నాడే
మనకి ఏ ప్రతికూలత ఉండదు గనుక
మనం అంత...వారి శ్రమను గౌరవించాలిక
....రాజ్ తొర్లపాటి....