నాలోనేను
నాలోనేను
అనుక్షణం ముడుచుకుంటున్నా నాలోనేను
అంతులేని అగాధాలను మనమధ్య సృష్టిస్తే
అవమానాలు అతిథిలా ఆదరిస్తే
అవని అంత సహనంలేని నేను
అణుచుకుంటున్న ఉద్వేగాల సమరంలో
అంతర్మథనపు కల్లోలం నాలోనేను
అపనిందలు మోసినవేళ
అశోకవనంలో అతివను నేను
అదేగా సమాజపు కట్టుబాటులో
అలల హోరుని హరించే చెలియలికట్ట
అలుసేగా ఆడదాని జీవితపు చితికంటా
అదురుతున్న కళ్ళలో కన్నీళ్ళే తన జంట