అదే గతి
అదే గతి
మట్టిపట్టి పగిలిన కాళ్ళు
చెబుతున్నాయి అమ్మ పడే కష్టమేమిటో
కమిలిన భుజం చెబుతోంది
నాన్న మోసే భాధ్యతల బరువెంతో
కడుపు నింపే వేళలో తన ఆకలి
తెలియని పిచ్చిదామె
సంతోషాలు నింపుతూ
కష్టాలు మనవరకురానివ్వని
రక్ష అతడు
వయసొచ్చాక పుట్టే ప్రేమలో
మునిగి తేలే మనకు
కన్నవారి ప్రేమ కానరాదు
ముద్దతిండికై వేచే
ముష్టివారిని చేస్తాం
ఆశ్రయంలేని అనాధలను చేసి
అర్థాంతరంగా వీధిలోకి నెట్టేస్తాం
కాలంకరిగి వయసుమళ్ళి
అదే వీధిలో నిల్చున్న వేళ
కళ్ళు కన్నీటి సంద్రమైనవేళ
చేసిన పాపం చెంపపెట్టై తగలకపోదా