మానవమృగాలు
మానవమృగాలు


నలుదిక్కులా కాచుకున్న గుంటనక్కలు
నమిలేసే చూపులతో మానవదెయ్యాలు
నరుల అవతారంలో నరమాంసభక్షకులు
తమ ఆకలిచూపులతో
చేసారు పసిఎదపై రాక్షససంతకం
కరిగిపోయిన ప్రాణానికిలేదు విలువ
గుంపుగా చేరిన మానవమృగాలవేటలో
పసిలేడికూనై తల్లడిల్లింది
ఆడశరీరంపై మాత్రమేగా వారికున్న కాంక్ష
రాకాసిఆటలో నలిగి చిధ్రమయిన చిరుప్రాణం
ఎంత విలవిలలాడిందో ఆ పసిమానం
కత్తిరిస్తుంటే కుత్తుక
కరిగిపోయాడేమో దేవుడు కదిలిరాలేదు
ఆరేళ్ళ ముద్దులతల్లి
రైలుపట్టాలపై శవమైతే
ఒకరోజు కథనమై మాసిపోయింది
కన్నతల్లి కన్నీటి చారికలలో మిగిలిపోయింది
పసిగుడ్డై తన ఎదపై చేరి నేడు
కానరాని జ్ఞాపకమైమాయమయింది
ఎంతమంది పసిపిల్లలసమాధులపై కడతారో
ఈ మగమానవమృగాలకు ఉరికంబం
వేచిచూసే సహనం నశించినవేళ
చేయదా ఈ సమాజం సజీవదహనం
.