STORYMIRROR

burra saibabu

Tragedy

5  

burra saibabu

Tragedy

నాన్నా!! మా బడి ఎప్పుడు తెరుస్తారు

నాన్నా!! మా బడి ఎప్పుడు తెరుస్తారు

1 min
348

!అటూ ఇటూ పరిగెత్తే, అల్లరి మేఘాల ఉనికి లేని ఖాళీ అకాశ0 పగటి కిరణాలు, రాత్రి మినుగురులు కోల్పొయిన ఒంటరిలా దిగులైపొయింది! జమ్మిచెట్టుమీద దాచబడ్డ ఆయుధాలు, ఉనికి కోల్పోయినట్లు పడి ఉన్నయి! మైదానం తువ్వాయిలు లేని వనమైపొయింది! పచ్చిక బయలులో ఉడతలు, తమని ఆడించి ఉరికించిన నేస్తాలకొసం, ఆశగా ఎదురు చూస్తున్నాయి పక్షులు లేని చెట్టు ఆకులతోనె సరిపెట్టుకుంది చేపల గలగలలు లేని తరగతి నది ఒక యుద్ధానంతర నిశ్శబ్దంతో లఘుకోణలు గా కుచించుకుపొయింది రంగులు కొల్పొయిన ఇంద్రచాపం చివరి అంచు, నా కంఠానికి తగిలి గాయమై రక్తసిక్తమైపొయింది కిటికీ ఊచల్లొంచి నావైపు చూస్తూ ఒక పిల్లవాడి గొంతు, మా బడి ఎప్పుడు తెరుస్తారు? అని.                                               :


Rate this content
Log in

Similar telugu poem from Tragedy