రాలిన మొగ్గలు
రాలిన మొగ్గలు


*******
ఉవ్వెత్తున ఎగిసే ఉత్సాహం లేదు
గలగల పారే సెలయేటి చైతన్యం లేదు
ఊహలోనైనా ఉజ్వల భవిష్యత్ లో విహరించడం లేదు
నింగి నంటే కెరటాల పొంగు లేదు
ఆటపాటలతో ఆనందించే ఆహ్లాదం లేదు
అందాలను ఆస్వాదించే ఆనందం అంతకన్నా లేదు
సాహిత్యాన్ని చదివి, సంతోషించే సమయం లేదు
తొలకరిని చూసిన పులకరింత లేదు
గ్రీష్మంలో హేమంతాన్ని చూసిన గిలిగింత లేదు
శిశిరంలో వసంతం వచ్చిన సంతోషం లేదు
జీవితపు మధురిమల గురించిన ఆశలు అసలు లేవు
ఉన్నద
ల్లా పోటీ ప్రపంచపు టెన్షన్ లే
తలకు మించిన సిలబస్ తో
అనుక్షణం పెరుగుతున్న ఆందోళ నే
కన్నవారికి దూరమైనా బెంగే
గుక్కతిప్పుకోలేని సమస్యలే
కాలేజీ నాలుగు గోడలే జీవితమనుకుని
ఆశయాల ఆరాటానికి, ఆవేదనతో పోరాటం చేసి
ఆలోచనలేని ఆవేశంలో ఒత్తిడికి, ఓటమికి తలవంచి
శాశ్వత పరిష్కారంగా తనువు చాలించే
విరిసీ విరియని మనసులతో
ఎదిగీ ఎదగని వయసులో
గతి తప్పి గాఢ అంధకార భవిష్యత్తునూహించి
వికసించకనే రాలిన మొగ్గలు
**********