అమ్మ - నాన్న - ఓ జీవితం
అమ్మ - నాన్న - ఓ జీవితం


ప్రాణం పణంగా పెట్టి ప్రాణ మిస్తుంది అమ్మ
అనుభవాలు పాఠాలు చేసి బాట చూపిస్తాడు నాన్న
అన్ని పనులు అసహ్యమనక చేసి ఆత్మీయమవుతుంది అమ్మ
కష్టమైన పనులు కనపడకుండా చేసి కంటివెలుగ వుతాడు నాన్న
లాలపోసి దిష్టి తీసి జోలపాటవుతుంది అమ్మ
చేయి పట్టి, వెన్ను తట్టి జీవితమవుతాడు నాన్న
అమ్మ ఒడినే బడి గా చేసి తోలిగురువవుతుంది అమ్మ
ప్రపంచాన్నే పాఠశాల చేసి మలిగురువవుతాడు నాన్న
అప్యాతానురాగా నుబంధాల ప్రతీకవుతుంది అమ్మ
మమతానురాగాల పోదరిల్లుకు వారధవుతాడు నాన్న
ఆటపాటలతో చిన్నిలోకాన్ని పరిచయం చేస్తుంది అమ్మ
ఆలోచనా క్షరాలతో విశాలవిశ్వాన్ని పరిచయం చేస్తాడు నాన్న
గారాబాల పేచీల వేళ ముద్దుల మురిపెమవుతుంది అమ్మ
తప్పటడుగులు సరిచేసే దిక్సూచి అవుతాడు నాన్న
కష్టాలన్నీ కళ్ళవెనక దాచి అమృతమందిస్తుంది అమ్మ
కన్నబిడ్డ కు కనబడకుండా కష్టాలకెదురీదుతాడు నాన్న
వేదనల వేళ విడదీయరాని బంధమవుతుంది తల్లి
వేదన వెన్నంటి ఉండి పరిష్కా రమవుతాడు తండ్రి
**************