అమ్మ
అమ్మ


అక్షరాలు పూర్తిగా అప్పచెప్పగలవా
ఆ పదాన్నీ అమ్మతనాన్నీ
అందమైన పదాలు పూర్తిచేయగలవా
అమృతాన్ని నింపుకున్న అమ్మనీ
క్షమయా ధరిత్రి కనీస సుఖమెరుగని
కాలంతో పరుగులిడుతూ బిడ్డలకై ఆవిరవుతూ
కరుణకు రూపమై కల్పవృక్షమై
కష్టాల కొలిమిలో తానున్నా అది కనపడనీయక
మన గురువై నిలిచి గెలుపుని చూసీ
ఆనంభాష్పాలిచ్చే కామధేనువై
మనని జీవితాంతం కాచే తోడు
కోవేలలేని దేవత అమ్మ