STORYMIRROR

Madhuri Devi Somaraju

Inspirational Children

4  

Madhuri Devi Somaraju

Inspirational Children

మన రక్షకులు - ఘన త్యాగధనులు

మన రక్షకులు - ఘన త్యాగధనులు

1 min
237

మనమంతా నిద్దుఱోవు వేళ

తనువంతా కనులు చేసి

జనులను కాచు వారు

జవానులు మన జవానులు

నింగి వాన కార్చి నీరు చేర్చెడి వేళ

నిప్పు మీదకొఱిగి కప్పు కూలి

ప్రాణమోడు వేళ పాశము నాపగ

వచ్చి గాచు మనను! వారు గాద

అందమైన భవిత నవని కోసము పెట్టి

మరలి రాని వారు మనల కొఱకు

పణము పెట్టి వాని ప్రాణము వదలుచు

నాదరించునండి యందముగను

ఈ క్రింది పద్యము వారికి అంకితము

దేశ సేవ నందు ప్రీతి! దేహ చింత నెఱుఁగరే

లేశమాత్రమైన మీరు! లిప్తపాటు దైవమౌ

యీశుడైనయాగునేమొ!నెట్టి స్వార్థమొందరే

యాశ మాదు క్షేమమంచు యార్తి జూపి వైరి లౌ

మూకలెల్ల దరిమి కొట్టు పోరు నందు గెలిచి యే

చీకు చింత మాదు దరినిఁ జేరనీక నిత్యమున్

వేకువంటి వెలుగు పంచు వీర ధీర శూరులౌ

మీకు వందనంబుఁ లిడుదుఁ మేము గర్వమంది మెండుఁగన్



Rate this content
Log in

Similar telugu poem from Inspirational