శ్రీ మహాలక్ష్మీ
శ్రీ మహాలక్ష్మీ


కనక మహాలక్ష్మి వమ్మ నీవు
కనుక మాకు సదా సిరులనొసగెదవు
కరి మకరములు మెలగును నీతో
కామధేను కల్పతరువులు కూడును నీతో
కరుణామృతమును కురిపించెదవూ
కదనరంగమునయును గెలిపించెదవూ
కమలవాసినివమ్మ దేవి
కలువలరేడు సహోదరివి
కచ్ఛపీ పతికీ మాతవు నీవూ
భువనేశ్వరియే మాతా నీకూ
కడలినుండి ఉద్భవించినావూ
కొలనులోనూ నిలిచినావూ
కొలువుండిపోమా మా గుండెల్లో
కొంగు బంగారమై మా జీవితాల్లో
కోదండుని ఆ కృష్ణుని అనుసరించినావూ
కళత్రముగా అవతారాలలో అనుగమించినావూ