ప్రకృతి
ప్రకృతి
1 min
1.6K
పచ్చని చెట్ల పచ్చదనంతో అగుపించే ప్రకృతి,
పక్షుల కిలకిల రావాలతో పలకరించే ప్రకృతి,
కోకిలల కుహూ కుహూ రాగాల రవళి,
నెమలి నాట్యాల సోయగాల కేళి,
జల జల జాలువారే జలపాతాల సవ్వడి,
ప్రవాహపు పరుగులతో ఉరకలెత్తే నదుల వడి,
నదుల నీటికి నిలయమైనది కడలి ఒడి,
అందిస్తున్నది అందరికీ ఆధారమైన వర్షపు సందడి,
కదలక నిలిచే కొండల నడుమ భానుడు,
కిరణాల కాంతితో ఉద్దేపితుడయ్యే జీవుడు,
తమ తమ దిన చర్యలతో మానవులు,
బ్రతుకుతున్నారు యాంత్రిక జీవితములు,
మానవ అలసటలను దూరం చేసే చల్లని పవనాలు,
మిల మిల మెరిసే నక్షత్ర కుసుమాలు,
అందరినీ ఆహ్లాదపరిచే చంద్రుని వెన్నెల కిరణాలు,
భగవంతుని అద్భుత సృష్టియే ప్రకృతి.