నారిగాడి నమ్మకం
నారిగాడి నమ్మకం
నింగికెగసిన నీలం నెలలైనా నేలకు చేరకపాయే! నెర్రులీనినావా ఓ నారులతల్లి!!!
నాగలట్టి నారిగాడు నాలుగు నెలలాయె!
నాలుక నాలుగు నూకలు నెట్టి నలభై నాడులాయె!
నిలచిన నీడన నిలబడలేక నీరసమాయె!
నిలచి నిమ్మదించ నిముషం తీరికకాదాయె!
నీకేడిదిరా ఈ నిబ్బరం నారిగా అంటే
నింగిన, నేలన, నీటిన, నడుమన నూకాలమ్మే ఉందని నమ్మకమాయె!
నా తల్లి నా నీడగా ఉండగా, ప్రతినాడు నిండుగా నవ్వు నాదిరా అని నడి ఎండన నడచిపాయె !!!!