ఏది నీదీ ? ఏది నాది ?
ఏది నీదీ ? ఏది నాది ?
ఏది నీదీ ? ఏది నాది ?
- నీదన్నది ఏదీ లేదీ లోకంలో ,
నీదనుకున్నదీ , నువ్వు అనుకున్నది , ఏదైనా ...
నీ తోడే వస్తుందా , నువ్వీ లోకాన్ని వీడే సమయంలో ...!
కడకు అన్ని ఆపేక్షలూ, ఉపేక్షింపకా తప్పదూ ..
తుదకు అన్ని ఆశలూ, నిశలు కాకా తప్పదూ ..
ఈర్ష్యలైనా , ఈసడింపులైనా ..
పగలైనా , ప్రతీకారాలైనా..
వగలైనా , వలపులైనా ....
>
పంతాలైనా , పట్టింపులైనా ..
బంధాలైనా , బంధుత్వాలైనా ..
ప్రేమలైనా , స్నేహాలైనా..
సుఖాలైనా , దుఃఖాలైనా ..
ధనమైనా , దరిద్రమైనా..
కులమైనా , మతమైనా..
మదమైనా , మాత్సర్యమైనా ...
- ఏదీ తోడురాదు , మరణం పేరుతో మేను మన్నులో మమేకమయ్యే వేళలో ..
ఆయువు వాయువులో కలిసే క్షణంలో ..!!