రాధా రమణ
రాధా రమణ


శీతాకాలపు చల్లని గాలులు ఆమెను పిలిచినవి
యమునా తీరపు ఇసుక రేణువులు ఆమెను పిలిచినవి
సుగంధభరిత పుష్మములు ఆమెను పిలిచినవి
వేణు గానము ఆమెను పిలిచినది
రాధా రాధా
వేగిరము రమ్మని గోపికలు పిలిచిరి
వచ్చినది రాధ
రాధా రమణుల సంగమము
సంబరం తాకెను అంబరము
కార్తీక పౌర్ణమి ఘడియలలో
రాస లీలలాడిరట రాధా కృష్ణులు
ఒకటే ఆత్మగా కనిపించిరట
బృందావనము పులకించెనట