Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Varanasi Ramabrahmam

Drama Romance

5  

Varanasi Ramabrahmam

Drama Romance

పదహారేళ్ళ వయసు (రచన 1988)

పదహారేళ్ళ వయసు (రచన 1988)

2 mins
34.8K



1 కన్నియను నేను ఎల జవ్వనమున నున్న దానను 

వన్నియలు కల్గి మేను తీరినది సుందరమైన ఒంపులు 

రసికుల నోరూరింపగ ఇంపుగ ఎదిగితి నేను 

సొంపులు భాసింప పూవిలుకాని శరమ్ముగ

 

2 రాకుమారిని నేను లావణ్య విలాసములు నాసొమ్ము 

మన్మథుని సఖిని నేను లోకముననున్న అందములన్నియు

నాకే అమరినవి ఇంకా ఏలెదను యువక హృదయాలను

 

3 వేయుచున్నాను ఇప్పుడిప్పుడే ఓణీ 

ఇంకా కాలేదు బోణీ! చిరంజీవి సుమన్కమలహాసన్

నా హృదయ వీణను మీటి రాగములు పలికించు సరస సుందర వైణికులు 

 

4 పదహారేళ్ళ ప్రాయము నాది; నేర్చితి చదువనువ్రాయను;

ఇంటరు ప్రథమ ఇప్పుడు నా చదువు అప్పుడే చదువగలను

తోటి విద్యార్థుల పాఠములు చెప్పు ఒజ్జల; నన్ను చూచినప్రతి

మగవాని కౌతుకము, వాని చూపుల నిండిన భావముల ముదమున నేడు రేపుల

 

5 యండమూరి వీరేంద్రులు నా హృదయేంద్రులు 

మల్లాది కృష్ణులు నా చిత్తపు చిలిపి కృష్ణులు 

చందువారు పూయుదురు మేనంత చందనము

చల్లా వారు ఓహ్! కమ్మనైన చల్ల వారు 

 

6 సూర్యదేవర నా సాహితీ దేవర 

నవలల మనసులు పరవశ మొంద 

నవలలు వ్రాయు వీరు చక్రవర్తులు

నా హృదయ సామ్రాజ్యమునకు 

 

7 సువర్నా కన్నన్ నా అభిమాన రచయిత్రి 

చేసేద నేను కూడ ఆమె పాత్రల వలె సాహసములు

మగవారిని మించినధైర్యము శక్తి యుక్తులతో 

 

8 రవిశాస్త్రి వెంగసార్కర్ హీర్వాని శ్రీకాంత్ నిపుణులు

వీరు బంతులాట యందు వంతులు పోయి పూయింతురు

నా హృ దయమున చేమంతులు పోటీ పడి మురిపింతురు కలలలో కమనీయముగ 

 

9 మా పక్కింటి అబ్బాయి బి. ఏ. ప్రథమ 

అల్లుతాడు తీయనైన కవితలు; సాహిత్యసినిమా

క్రికెట్ చర్చలు కాలక్షేపము మాకు

అది ఏమి ఇది ఏమి అన్ని మాట్లాడుకొందుము

 

10 ప్రయత్నించును అతడు నన్ను తాకుటకు 

చూసెద అప్పుడు నేను తీక్షణముగ 

ముడుచు కొనును అతని ముఖ కమలము

కిల కిల నవ్వేద నేను; కళ కళ లాడును ఆతని మోము

 

 11 వ్రాసెద మెడికల్ ఎంట్రన్స్ సీటు వచ్చిన

చేసెద రోగుల సేవలేనిచో చదివెద బి. కాం.

మా కాలేజిలో వెదికెదరు పెద్దలు పెండ్లి కొడుకులను 

 

12 పంచుకొనను గుమాస్తాతో బ్రతుకు 

అతుకుల బొంత గతుకుల రోడ్డు అది

కట్నము తక్కువైనను ఎవరైన ఏరి కోరి

తెచ్చుకుందురా కష్టములను 

 

13 క్లాస్ వన్ ఆఫీసరు కట్నము లేకుండ

చేసికొనును నన్ను పెండ్లి; కట్నము

అడుగువాని నాలుక కోసెద కాళ్ళు

విరిచెదఅట్టి పశువు అర్హుడు కాడు నా తనువు తాకుటకు

 

14 చక్కని రూపము గల మగనితో

విమానములు కార్లు ఎక్కుచు దిగుచు

ఐదు నక్షత్రముల హోటళ్ళలో

మెక్కుచు సొక్కుచు సోలుచు

నిక్కి నీల్గెదను చక్కందనాల విందులలో 

 

15 పిల్లల అప్పుడే కనము; వన్నె తగ్గును

వాడును నా అందము; హాయిలో త్రుళ్ళి త్రుళ్ళి

ఎప్పుడో కందుము బుజ్జి బాబును బుల్లి పాపను

మా జీవితములకు వెల్గు నిచ్చు రవి చంద్రులను 

 

16 కాను నేను సగటు తెలుగు బాల

కాదిది వట్టి నా పగటి కల

భావసరసిని కదిలిన చక్కని అల

ఆనందించుడు కన్నియ తలపుల 



Rate this content
Log in