నిస్సహాయుడు
నిస్సహాయుడు


కూర్చుని రెండు ఇచ్చకపు కబుర్లు చెప్పి
కోట్లకు పడగలెత్తు ఆధ్యాత్మిక గురువులు;
బహిరంగ సభలో మైకు ముందు నోటికొచ్చిన
హామీలు ఇచ్చేసి
వోట్ల వరద పారించుకొని పదితరాల వరకు
సరిపడా ఆస్తులు, డబ్బు, నగ, నట్రా సంపాదించుకొను నాయక మన్యులు
వినోద కార్యక్రమాలలో, సాధనాల్లో వినోదం పంచి
ఆరాధ్య దైవాలై పోయి డబ్బు, పేరు సంపాదించు
నటీనటులు, విదూషకులు, వన్నెల విసనకర్రలు
జనాల మనసులు ఎంత బలహీనమైతే
ఈ పై వారందరికీ అంత ఆదాయం, కాసుల పంట
గొప్పవాడై, తన్ను తాను సమర్ధించుకోగల
మానవుడు వీరందరికీ గులామై స్వాభిమానం
స్వోత్కర్ష, దర్పము, ఆత్మ విశ్వాసమూ మరచి
రాత్రి పగలు వినోదం వ్యసనమైన మనిషి మరి
దేనికీ అక్కరకు రాడు; తనకు తాను సాయము చేసుకోలేని నిస్సహాయుడు