స్వర్గం నుండీ నీకో ప్రేమ లేఖ..
స్వర్గం నుండీ నీకో ప్రేమ లేఖ..


ప్రియతమా..
నేను నీకు భౌతికంగా దూరం అయిన నాటి నుండి...ఆ దేవుడు మనల్ని ఒకరి నుండి ఒకరినీ శాశ్వతం గా విడదీసిన నాటి నుంచీ నీవు క్షణం ఒక యుగం లా,మనసును ఒక యంత్రం లా,నీవొక శిలలా గడుపుతున్న వని...నాకు తెలుసు..విధి మనల్ని శారీరకంగా విడదీసిన...మన మనసుల్ని ఏ శక్తులూ విడదీయలేి వు... ప్రియా....నీ బేల తనాన్ని నే చూడలేక రాస్తున్న...లేఖ
నీకు తెలుసా..
నీ కన్నుల వెలుగుల్లో నీ చూపుగా నే మెరుస్తున్న..అని.
నీ పెదవుల నవ్వుల్లో నిన్ను తీయగ అ ల రిస్తున్నా అని.
నీ మాటల పలుకుల్లో భావం నేను అయి నిను పలుకరిస్తున్న అని..
నీ కమ్మని పాటల్లో లాలిని నేనై..నిను నిద్ర పుచ్చుతానని...
నీ గుండెల్లో శాశ్వతమైన ప్రేమను నేనే...నిను నడిపిస్తున్న..అని...
నీ మనసు లో నా మీద దిగులు వుండి...ఒక్కొక్క సారి నీవు ..అందరి కోసం హాయిగా నవ్వే ఆ నవ్వులో నేను వున్నానని...
నీవు పూజించే దైవం లో..ప్రేమించే ప్రకృతి లో...
నేను నీకు కనీ కనిపించకుండా..దోబూచూ లాడుతూనే..నీకు తోడుగా...నీకు ఆత్మ విశ్వాసాన్ని,ధైర్యం,తెగువ ఇస్తున్నానని...గుర్తించు..
నిన్ను ప్రేమించే,నిను ప్రతి క్షణం నవ్వుతూ చూడాలని కోరుకొనే..నీ ప్రపంచానికి..నేనే నీవై...నీవే నేనై నట్టుగా..అందరిలో నన్ను చూస్తూ..నవ్వుతూ నవ్విస్తూ జీవించు ప్రియా...చిరంజీవి..గా..
ఇట్లు....నీ భాగ స్వామి..