STORYMIRROR

Bharathi Murthy

Romance

4  

Bharathi Murthy

Romance

నన్నే నీకు అప్పగించా

నన్నే నీకు అప్పగించా

1 min
428

ప్రియా....నీ ప్రేమ లో వున్నప్పుడు,


నీ తలపుల తోపు లలో నేను ఎక్కడ తప్పిపోతానో

అని...నా మనసే ...నీకు అప్పగించ.


నీ మాటల మలుపులతో నేనెక్కడ మరచిపో తానో ..

అని...నా పలుకే నీకు అప్పగించ.


మన పెళ్లి రోజున ...కన్నీటితో నన్ను నీకు అప్పగించిన...


నాకు తనతో వున్న పేగు బంధాన్ని ఆ రోజే .. వేరు చేసినట్టు...విలవిల లాడిన మా అమ్మ...


నాకు తనతో వున్న ప్రేమ బంధాన్ని ఆ రోజే..తీసేసుకొన్నట్టు...కుమిలి పోయిన మా నాన్న...


నన్ను పెంచిన స్నేహితురాలు...ఇక రాదని

దారంతా... తివాచీలా...రాలి కమిలిపోయి న... జాజిపూలు..

నేను నీకు ఎలా చెప్పను...


నేను నడచిన ఈ దారులే...నన్ను పెంచిన ఈ ప్రేమ లే

ఈ ఆప్యాయత లా పరిమళాలే....

ఆపేక్ష లు ఎలా పంచాలో....బంధాల్ని ఎలా పెంచాలో

అనుబంధాన్ని...ఎలా శాశ్వతం చేసుకోవాలో...

నేర్పించాయని....నీకు అలాగే...స్వచ్ఛంగా

అప్పగించాయని...


నీకు ఎలా చెప్పను...


ప్రేమ లో నిజాయితీ.....బంధాల మధ్య అంకిత భావం....మన శాశ్వత మైన గుర్తింపు స్థానం...అని

నేను..నీకు ఎలా చెప్పను...


మనసా వాచా కర్మణా...నన్ను నీకే అప్పగించాక...

నాకంటూ...అస్తిత్వం... ఏది...ఎక్కడుంది...

నీవే నేనై...పోవడం...నేనే నీకై ...ఏకమై పోవడమే

...ప్రేమకి రూపం...ఏమో..అదేనేమో...నిన్ను నాకు

నన్ను నీకు అప్పగించడం...


Rate this content
Log in

Similar telugu poem from Romance