వలపు తలపు
వలపు తలపు


ప౹౹
కల కనుమరుగవునే అలలా తీరం చేరకనే
పూల గంధం పురివిప్పునూ ఎవరు కోరకనే ౹2౹
చ౹౹
పేరిమి పెరిగి ప్రేమగా మారే ఏమి తెలియక
కూరిమి కూడి కూర్చెనులే అసలే అలియక ౹2౹
ఏమి మాయో ఇది సృష్టిలో భలే గమ్మత్తులే
లేమి మనసుకే లేనిపోని కొనితెచ్చే మత్తులే ౹ప౹
చ౹౹
కొత్తగా కోటి వీణలే మోగే నిరతమే మదిలో
మెత్తగా అణవణవు చేరే సౌఖ్యంగా ఆదిలో ౹2౹
గడిచినకొద్దీ గతి తప్పేది ప్రేమే కాదులే చేరి
నడిచినకొద్దీ నడత చెదిరేది మోహమే మరి ౹ప౹
చ౹౹
ఆకారంలేని మనసులో అలజడే పెంచేనులే
శ్రీకారం చుట్టేసి సుడిలాగా పట్టి ఉంచునులే ౹2౹
వలపు మాయే అది వయసుతోను పెరిగేను
తలపు మలపులో తనివి తీరకను తరిగేను ౹ప౹