Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

వెన్నెల వన్నెలు

వెన్నెల వన్నెలు

1 min
102



ప౹౹


 వెన్నెల రేయి తెచ్చేను ఎదలో చల్లని హాయి


కన్నుల వన్నెలు కలబోసి పలవరించే వేయి ౹2౹


చ౹౹


ఎంత సౌఖ్యమో ఎదను గిలిగింతలే చేరగా 


వింత మోహమే విల్లు ఎక్కు పెట్టెను కోరకా ౹2౹


పలవరింతలే పదనిసలుగా పల్లవించెనులే


కలవరింతలే కనికరముతో విన్నవించెనులే ౹ప౹


చ౹౹


ఎక్కడో దాగిన వలపు బీజం వరదలెత్తేనూ 


ఒక్కడై ఉండినా ఊరుకోదూ ఉరకలెత్తనూ ౹2౹


తడి మంటలు తనువులో తనూ వెలిగించే


వాడి జంటలు వలపులో నిలువనే కరిగించే ౹ప౹


చ౹౹


వెన్నెలా చల్లనని మదినది ఊహించేయునే


కన్నెలా మరులనే వేడినే మరి ఎగదోయునే ౹2౹


తెల్లనీ వెన్నెలను తెలుసుకోను కష్టమే మరి


మెల్లని మెళకువతో దరి చేరకా నష్టమే కోరి ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance