STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

ఊరించకే వయసా..

ఊరించకే వయసా..

1 min
330

ఊరించకే వయసా అదేమో నెమ్మదించదూ

సారించకే గురిని తనువేమో సమ్మతించదూ

వలపేమో వరదలెత్తి చెలియలి కట్టను దాట

తలపేమో ఊహలతో పూయించెనే పూదోట


రేయి గడిచిపోదు రెక్కలిప్పకనే ఆ మోహం

పోయి పోయి పొటమిరించెను ఓ వ్యూహం

హాయి మిగిలిపోవును కాలం కరిగిపోవును

చేయికలిపిన జతగా జ్ఞాపకం నిల్చిపోవును

ఊరించకే వయసా అదేమో నెమ్మదించదూ

సారించకే గురిని తనువేమో సమ్మతించదూ


కదిలే చందమామకు కనువిందు చేయుమా

మదిలో మారాకులే పండించ విచ్చేయుమా

వెచ్చని నిట్టూర్పులు వేచిన ఆ చేకూర్పులు

మెచ్చిన మేని తళుకులు మేలైనా తీర్పులు


ఊరించకే వయసా అదేమో నెమ్మదించదూ

సారించకే గురిని తనువేమో సమ్మతించదూ

వలపేమో వరదలెత్తి చెలియలి కట్టను దాట

తలపేమో ఊహలతో పూయించెనే పూదోట


పూల పరిమళాలు పురి విప్పేసి పులకరించ

గాలి గాంధర్వాలు గమనించేసి అలంకరించ

కాల గమనాలు మరచి కాంక్షలను రగిలించ

పాల పరువాలు వెరచి కాందశీకం కౌగలించ


ఊరించకే వయసా అదేమో నెమ్మదించదూ

సారించకే గురిని తనువేమో సమ్మతించదూ

వలపేమో వరదలెత్తి చెలియలి కట్టను దాట

తలపేమో ఊహలతో పూయించెనే పూదోట




Rate this content
Log in

Similar telugu poem from Romance